telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ లుక్

Bellamkonda-Srinivas

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌ అవుతున్నాయి. తొలిసారి పోనీ టెయిల్‌లో, గుబురు గడ్డంలో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్‌ మాస్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. “అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి విజయాన్ని అందించింది. కాగా ఇప్పుడు ఈ హీరో తన ఎనిమిదో సినిమా చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కబోతున్నది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ తన బాడీని పూర్తిగా మార్చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. 

Related posts