telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వీడియో వైరల్ : కొరడాతో కొట్టుకుంటున్న సల్మాన్… !?

Salman-KHan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దబాంగ్-3” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సల్మాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆయన కొరడాతో కొట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. పోతురాజు వేషధారణలో ఉన్న కొంతమందిని సల్మాన్ ఖాన్ ఇటీవల కలుసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించిన భాయ్ అనంతరం వారి దగ్గర నుంచి కొరడా తీసుకొని సరదాగా తాను కూడా కొట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వారితో గడిపి వారి బాధను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే మీరు ఇలా ట్రై చేయకండి, ఎవరు మీద కూడా ప్రయోగించకండి అని తన అభిమానులకు హితవు చెప్పారు సల్మాన్. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

 

View this post on Instagram

 

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don’t try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Related posts