telugu navyamedia
సినిమా వార్తలు

“సమ్మోహనం” విలన్ మృతి

Amit-Purohit

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, అదితిరావు హైదరి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా “సమ్మోహనం”. ఈ చిత్రం 2018 జూన్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ అదితీరావు హైదరీకి మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ చిత్ర కథానాయకుడు సుధీర్‌బాబు ట్విట్టర్ వేదికగా తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. అమిత్ మరణం తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు. అమిత్ “సమ్మోహనం” చిత్రంలో సమీరా (అదితి)కు మాజీ ప్రియుడు అమిత్ మల్హోత్రా పాత్రలో నటించాడని, చాలా స్నేహశీలి అని సుధీర్‌బాబు పేర్కొన్నాడు. మంచి నైపుణ్యమున్న మరో యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి షాట్‌కూ 100 శాతం న్యాయం చేసేవాడని సుధీర్ బాబు తెలిపాడు. అమిత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే అమిత్ ఎలా మృతి చెందాడనే విషయం మాత్రం తెలియరాలేదు.

Related posts