కన్నడ స్టార్ హీరో యష్ “కేజీఎఫ్” చిత్రంతో దేశవ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ డమ్ సొంతం చేసుకోకముందు చాలా కష్టాలు పడతారు. అదేవిధంగా యష్ కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడట. తాను పడిన కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు యష్. యష్ హీరో కాకముందు కొన్ని టీవీ సీరియల్స్ లో నటించాడు.
అలానే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తన కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో తనతో అడ్డమైన పనులు చేయించుకోవడం మనసుకు బాధ కలిగించేదని, స్టార్ డైరెక్టర్ల కింద పని చేసే సమయంలో తన చేత టీ, సిగరెట్లు తెప్పించుకునేవారని, అయితే ఇలాంటి వాటికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన గోల్ కోసం ప్రయత్నించడంతో స్టార్ ను అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.