telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బాలకృష్ణ అభిమానుల తీవ్ర నిరాశ.. స్టిల్ తెచ్చిన తిప్పలు..

fans upset with balakrishna ruler movie still

దీపావళి పండుగ రోజున బాలకృష్ణ తన అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. నిన్న బాలయ్య లేటెస్ట్ మూవీ టైటిల్ ను ‘రూలర్’ గా అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన బాలయ్య స్టిల్ చూసి ఏకంగా అతడి అభిమానులే తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇక బాలయ్య సినిమాల నుండి సెలవు తీసుకుంటే మంచిదా అంటూ ఏకంగా అతడి వీరాభిమానులే అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ఘోరమైన ఫ్లాప్ గా మారడం ఆతరువాత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో బాలయ్య చాల షాక్ అయ్యాడు అన్న వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే ఆ తరువాత బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్టిల్స్ బయటకు వచ్చిన తరువాత బాలయ్య మేకోవర్ అదిరింది అంటూ అభిమానులు సంబర పడ్డారు.

ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. నిన్న పోలీసు లుక్ లో ఉన్న బాలకృష్ణ స్టిల్ ను చూసిన వారు అందులో ఉన్నది బాలకృష్ణ మాత్రమేనా అంటూ ఆశ్చర్య పోతున్నారు. చాల నీరసంగా మొఖంలో ఎటువంటి గ్లో లేకుండా కనీసం హెయిర్ స్టైల్ కూడ బాగా లేని బాలయ్య పోలీసు లుక్ ను చూసి అభిమానులు బెంబేలు పడిపోతున్నారు. అసలే హైప్ లేని ఈ సినిమాకు లేటెస్ట్ గా విడుదలైన బాలకృష్ణ లుక్ శాపంగా మారుతుందా అంటూ అభిమానుల భయం. ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ తనకు సెంటిమెంట్ గా పనికి వచ్చే సంక్రాంతిని వదులుకుని డిసెంబర్ 20న వస్తున్నాడు. దీనికితోడు ఈ సినిమాకు రవితేజ ‘డిస్కోరాజా’ సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ మూవీలు బాలయ్యను కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి నీరస అవతారంతో బాలయ్య పోలీసుపాత్ర మెప్పించలేకపోతే మరో భయంకరమైన ఫ్లాప్ బాలయ్యకు తప్పదా అంటూ దీపావళి రోజున అతడి అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు.

Related posts