telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విశాల్ యాక్షన్ .. ట్రైలర్…

vishal action movie trailer

విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్‌’. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం టర్కీలో తెరకెక్కిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూర్చారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానరుపై రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. ఐశ్వర్యాలక్ష్మి, యోగిబాబులు ఇతర తారాగణం. ఫుల్‌ ప్యాకేజీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సుందర్‌.సి దర్శకత్వంలో ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’ చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేక పోయింది.

దీంతో ఈసారి ఎలాగైనా పెద్ద హిట్‌ను సొంతం చేసుకోవాలని సుందర్‌.సి ప్రయత్నిస్తున్నారు. విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా ఆదివారం విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

Related posts