telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కేజీఎఫ్-2” నుంచి మరో సర్ప్రైజ్

KGF-2

2018లో విడుదలైన “కేజీఎఫ్” సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం “కేజీఎఫ్ 2” రానుంది. ఇందులో కూడా ప్రధాన పాత్రలో యశ్, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జూలై 29న సంజయ్ బర్త్‌డే సందర్భంగా అధీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 29న సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేయబోతున్నారట. 60 సెకన్లు ఉండబోతున్న ఆ వీడియోలో అధీర గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఇక సంజయ్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కించాడట ప్రశాంత్ నీల్ . కరోనా కారణంగా బ్రేక్ పడిన షూటింగ్ ను వచ్చే నెల నుండి పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related posts