telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పోలింగ్ పై ఆసక్తి చూపని గ్రేటర్ ప్రజలు…

ప్రజలు గ్రేటర్ ఎన్నికలను లైట్ తీసుకున్నారు హైదరాబాదీలు… ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ స్టేషన్లు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి… అప్పుడప్పుడు ఒకరు అన్న విధంగా వచ్చి ఓటువేసి వెళ్లిపోతున్నారు.. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా పాలకులను నిలదీసే సిటీవాసులు… తమకు నచ్చిన నేతను ఎన్నుకోవడానికి మాత్రం ముందుకు రాకపోవడం దారుణమైన విషయంగా చెప్పుకోవాలి… గత ఏడాది గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. ఈసారి అయినా 50 శాతాన్ని క్రాస్ చేసుందేమోనని అంచనాలు వేశారు.. కానీ, మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అంటే ఉదయం 7 గంటల ఉంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 6 గంటల సమయంలో 18.2 శాతం పోలింగ్ నమోదైంది.. సాయంత్రం 6 గంటలకు అంటే మరో ఐదు గంటల్లో పోలింగ్ ముగిసిపోనుంది.. ఇప్పటికైనా హైదరాబాదీలు తరలివచ్చి ఓట్లు వేస్తారా? గత రికార్డులను బ్రేక్ చేస్తారా? అంతకంటే తక్కువగానే ఓటింగ్ నమోదు అవుతుందా అనేది చర్చగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts