ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ధలో భాగంగానే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక దాగున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముట్టడిలో పంజాబ్ సింగర్ దీప్ సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సింగర్ దీప్ సిద్దూ ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. అతని చివరి లొకేషన్ హర్యానాలో ఉన్నట్లు గుర్తించారు. ఎర్రకోట ముట్టడి ఘటనలో దీప్ సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొట్టారని సిద్దూపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ కేసులో గ్యాంగ్ స్టర్ లఖా సీదానా పై కూడా కేసులు నమోదు చేశారు. అలానే రైతు సంఘం నేత దర్శన్ పాల్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పోలీసులు కోరారు. మూడ్రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 22 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు పోలీసులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post