telugu navyamedia
సినిమా వార్తలు

ర్యాప్ సాంగ్ కు కథక్ నృత్యం… ఆకట్టుకుంటున్న “హార్ట్ ఎటాక్” బ్యూటీ

Adah-Sharma

“హార్ట్ ఎటాక్” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న బాలీవుడ్ హీరోయిన్ అదాశర్మ మరోమారు తన డ్యాన్స్ తో సోషల్ లో అదరగొట్టేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అదాశర్మ తన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె బాలీవుడ్ సూపర్ హిట్ ర్యాప్ సాంగ్‌కు కథక్ నృత్యం చేసి, దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అది వైరల్‌గా మారింది. ఈ నృత్యాన్ని చూసిన అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోలో ఆమె రణవీర్ సింగ్ సినిమా “గల్లీ బాయ్”లోని సూపర్ హిట్ సాంగ్‌కు తనదైన శైలిలో నృత్యం చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

Related posts