telugu navyamedia
సినిమా వార్తలు

న్యూ ఇయర్‌కు మెగా ట్రీట్‌..‘స్వాగ్ ఆఫ్ భోళా శంకర్’

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు.  మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా ‘భోళా శంకర్’ ఒకటి.. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి గా మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. 

Keerthy Suresh To Play Chiranjeevi's Sister In Telugu Movie 'Bhola Shankar'  - Sacnilk

ఇప్పటికే ఆచార్య రిలీజ్ కు ఉండగా.. మలయాళ లూసీఫర్ రీమేక్ గాఢ్ ఫాదర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తుంది. తమిళ మూవీ వేదాళం కు రీమేక్ గా భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు చిరు.

 మరో ఏడాదైనా ఈ సినిమా పని ఉంటుంది. దాంతో మరో 60 లక్షలు ఖాయం. దాంతో పాటు సినిమా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వేదాళం రీమేక్ భోళా శంకర్ కోసం మెహర్ రమేష్ దాదాపు 2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అంటే చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది.

కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌ ఇచ్చారు ‘భోళా శంకర్‌’ చిత్ర బృందం. తాజాగా భోళా శంకర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి చాలా స్టైలిష్‌గా క‌న‌ప‌డుతున్నారు.

Megastar Chiranjeevi Bhola Shankar First  look Release

మొహానికి చేయి అడ్డు పెట్టుకుని..చేతికి కలర్ దారాలు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని ఒక‌ప్ప‌టి చిరు కనిపించాడు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ విడుదల చేశారు.

Tamannaah to play female lead in Chiranjeevi's 'Bholaa Shankar'

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈమూవీకి మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts