నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం తారకరామా పిక్చర్స్ వారి “కథానాయకుని కథ” సినిమా 21-02-1975 విడుదలయ్యింది.
నిర్మాత కె.దేవివరప్రసాద్ తారకరామా పిక్చర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు డి.యోగానంద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్నికి మాటలు: మోదుకూరి జాన్సన్, పాటలు: కొసరాజు, సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆత్రేయ, సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: జె.సత్యనారాయణ, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: చిన్ని, సంపత్, ఎడిటింగ్: బి.కందస్వామి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, సత్యనారాయణ, జి.వరలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, శ్రీవిద్య, రాజబాబు, భారతి, అల్లు రామలింగయ్య, రమాప్రభ, పండరీబాయి, మిక్కిలినేని, హేమలత, ఛాయాదేవి, తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు కె.వి. మహాదేవన్ గారి సంగీత సారధ్యంలో
“వేమన్న చెప్పింది వేదమురా”
“చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా ఒక మంచి మాట”
“శ్రీమతిగారూ ఆగండీ,మీ శ్రీవారేవరో సెలవివ్వండి”
“దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళూ మనిషి వేస్తాడు మూడు ముళ్ళూ,”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈచిత్రం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి, కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. మొదటి రోజు 35 కేంద్రాలలో 2లక్షల 75 వేల రూపాయలు, 3 రోజులకు 7లక్షల 30 వేల రూపాయలు, మొదటి వారం 13 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
ఈచిత్రం ఘనవిజయం సాధించి పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది. విజయవాడ – దుర్గా కళామందిరం లో 62 రోజులు ప్రదర్శింపబడి, షిఫ్ట్ మీద మరికొన్ని రోజులు ఆడింది. అయితే ఈ సినిమా దాదాపు 90 రోజులు వరకు ప్రదర్శింపబడినప్పటికి శతదినోత్సవం జరుపుకోలేకపోయింది. ఈ చిత్రంలో తమ అభిమాన నటుడు ఊరేగింపు సన్నివేశం గుంటూరు పట్టణంలో చిత్రీకరించారు. అయితే ఎన్టీఆర్ గారిని చూసేందుకు జనం విపరీతంగా లక్షలలో విచ్చేసారు.
గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ఎన్టీఆర్ గారిని ఊరేగింపు గా పట్టణ వీధుల్లో జరిపిన ప్రదర్శన లో వేలాది మంది అభిమానులు పాల్గొన్న సన్నివేశాన్ని చిత్రీకరించి ఈ సినిమా లో చూపించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్టీఆర్ అభిమాన సంఘం వారు ఎన్టీఆర్ గారిని సన్మానించారు. ఎన్టీఆర్ గారు నటించిిిన చిత్రాల వివరాలతో ఆనాడు ఒక సావనీర్ ను కూడా విడుదల చేసారు.
ఇక ఆ పాత్ర చేయలేను : చిరంజీవి