telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగులో ఈషా రెబ్బ “లస్ట్ స్టోరీస్”లో

eesha

ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియాకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిజిటల్ మీడియాకు పెరుగుతున్నఆద‌ర‌ణ‌ను అనుస‌రించి ప‌లువురు ద‌ర్శకులు, హీరోలు, హీరోయిన్స్‌, స్టార్ యాక్ట‌ర్స్ వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్న ఈషా రెబ్బా త్వ‌ర‌లోనే డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతుంది. వివ‌రాల్లోకెళ్తే.. డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి తెలుగులో ల‌స్ట్‌స్టోరీస్‌లో ఓ భాగాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఈషా రెబ్బా న‌టించ‌నుంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్క‌బోయే ఈ వెబ్‌సిరీస్ పార్ట్‌లో త‌న పాత్ర న‌చ్చ‌డంతో, ఇందులో న‌టించ‌డానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. `ఘాజీ`, `అంత‌రిక్షం` చిత్రాల త‌ర్వాత సంక‌ల్ప్ రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

Related posts