మా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ ఆదివారం ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో మా సభ్యులను లంచ్‌కు ఆహ్వానించారు. మా బిడ్డలు అందరం కలిసి ఇంటరాక్ట్ అవుదామని..మన విజన్ ఏంటో షేర్ చేసుకుందాం.. అన్ని విషయాలను చర్చించుకుందాం అంటూ ఇన్విటేషన్‌ను పంపారు ప్రకాష్ రాజ్. ఇక ప్రకాష్ రాజ్ ఇన్విటేషన్ పై బండ్ల గణేష్ తీవ్ర అభ్యంతరం తెలిపుతూ.. తనదైన శైలిలో స్పందించారు.
ఎన్నికల ప్రచారం పేరుతో కళాకారులందర్నీ ఒకచోటకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలాడొద్దని ప్రకాష్ రాజ్ పై బండ్ల విమర్శలు గుప్పించాడు. ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి.. కానీ, విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు. చాలా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి అడగండి కానీ ఇలాంటివి చేయకండి’ అంటూ ప్రకాష్ రాజ్ చర్యలని ఖండించాడు బండ్ల గణేష్. దీంతో ప్రకాష్ రాజ్ కూడా బండ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మా సభ్యులకి విందు ఏర్పాటు చేసిన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ బండ్ల వ్యాఖ్యలని ఖండించాడు. ఎలెక్షన్స్ అంటే ప్రచారం ఉంటుంది. అందులో భాగంగా క్యాంపెనింగ్ చేయాలి. మీటింగ్స్ పెట్టుకోవాలి. అదంతా ప్రాసెస్. కోవిడ్ నియమాలను పాటిస్తూ రాజకీయ ఎన్నికలు, పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, తాము కూడా అవే నియమాలను పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని స్పష్టం చేస్తూనే.. దీనిపై బండ్ల గణేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రకాష్ రాజ్.
మేమంతా దాదాపు నాలుగు గంటలు చర్చించుకున్నాము. ఇప్పటివరకు జరిగినవి.. జరగాల్సిన వాటి గురించి అందరితో మాట్లాడము. ఆయన మాటలకు నేను షాకయ్యాను. ఈరోజు చిన్న ఆర్టీస్టులు కూడా మాట్లాడారు. మేమంతా దాదాపు నాలుగు గంటలు చర్చించుకున్నాము. ఇప్పటివరకు జరిగినవి.. జరగాల్సిన వాటి గురించి అందరితో మాట్లాడము. ఆయన మాటలకు నేను షాకయ్యాను.
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు