“పీఎమ్ నరేంద్ర మోడీ ” సినిమా వచ్చేనెల 12 న విడుదలవుతుంది . ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ నేపధ్యమున్న సినిమాలు వాయిదాపడుతూ వస్తున్నాయి . ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ , ఉత్తరాఖండ్ , ముంభైలో జరిగింది .
“పీఎమ్ నరేంద్ర మోడీ ” సినిమాను సందీప్ సింగ్ సురేష్ ఒబెరాయ్ నిర్మిస్తున్నారు . ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు .నరేంద్ర మోడీ జీవితం చాలా విలక్షణమైనది , విభిన్నమైనది . టీ అమ్మే బాయ్ గా జీవితం మొదలు పెట్టిన మోడీ అంచెలంచెలుగా ఎదిగిన క్రమం , రాజకీయాల్లోకి ఎలా చేరాడు , గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలన ఎలా సాగింది .
2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎలా కాగలిగాడు ? తన చరిష్ మాతో ఎలా విజయాన్ని సాధించగలిగారు లాంటి అనేక అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి . నరేంద్ర మోడీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించాడు ఈ సినిమా అందరికీ స్ఫూర్తి దాదాయకంగా ఉంటుందని నిర్మాత సందీప్ తెలిపాడు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 12న విడుదల చేస్తామని చెప్పాడు