telugu navyamedia
సినిమా వార్తలు

మహర్షి ట్రైలర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు

Maharshi2

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు.

Maharshi1

ఈ సంధర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. ”తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. ఇప్పటి యంగ్ హీరోల్లో నేను అభిమానించేది విజయ్ దేవరకొండని. వారిద్దరూ ఇక్కడ ఉండడం సంతోషంగా ఉంది. నన్ను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెప్పాలి. నేను యాక్టింగ్ చేయగలనని నిరూపించిన సినిమా ‘మురారి’.. అది తీసిన కృష్ణవంశీ గారికి థాంక్స్ చెప్పుకోవాలి.

నన్ను స్టార్ చేసిన సినిమా ‘ఒక్కడు’ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. గుణశేఖర్ గారిని థాంక్స్. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ‘అతడు’.. అది తీసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ‘దూకుడు’ ఆ సినిమా చేసిన శ్రీనువైట్ల గారికి థాంక్స్. రెండు సార్లు నాకు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ గారికి ఋణపడి ఉంటాను. ఇప్పుడు నా 25వ సినిమా తీసిన వంశీ నాకు సోదరుడు లాంటి వాడు. నిజానికి వంశీ కథ చెప్పడానికి వచ్చినప్పుడు పది నిమిషాలు విని పంపించేద్దాం అనుకున్నా(నవ్వుతూ).. అప్పటికే రెండు సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో కుదరదు అనుకున్నా కానీ నేరేషన్ వినగానే నచ్చింది. టైమ్ పడుతుందని చెప్పాను.. దానికి ఆయన పర్లేదు సర్ వెయిట్ చేస్తా అన్నాడు.. దానికి ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకోసం రెండేళ్లు ఎదురుచూశారు. దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముగ్గురు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సంధర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ”ఒక్కో హీరో ఒక్కో కెమెరా యాంగిల్ లో బాగా కనిపిస్తారు. కానీ మహేష్ ఏ యాంగిల్ లో అయినా అందంగా కనిపిస్తాడు. రోజురోజుకి మరింత యంగ్ అయిపోతున్నాడు. ఒకప్పుడు చిన్నోడు నా మీద కోపంగా పూలకుండీ బద్దలు కొట్టాడు.. ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసు కదా.. ఇప్పుడు అంతకుమించి రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సంధర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ”మహేష్ బాబు గారికి నేను పెద్ద అభిమానిని. కాలేజ్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు యాక్టర్ అయిన తరువాత మహేష్ సర్ ని పిలవాల్సి వస్తుంది. మనవాడు అనుకునేవాళ్లం.. ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సివస్తోంది.. అప్పుడప్పుడు మహేష్ అని వచ్చేస్తుంది(నవ్వుతూ).. మురారి సినిమా నుండి ఆయన్ని ఫాలో అవుతున్నాను. అలాంటి హీరో నా సినిమాలకు ట్వీట్ వేయడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఆరోజు నా పుట్టినరోజు.. ఆరోజు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చారు.

నరేష్ మాట్లాడుతూ… ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు 25వ చిత్రంలో నటించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినిమాను నిర్మించిన ముగ్గురి నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడే సినిమా గురించి ఏమీ చెప్పలేను. సక్సెస్ మీట్ లోనే అన్ని మాట్లాడతా. మహేష్ బాబు 25వ సినిమా మహర్షి తప్పకుండ బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది. నన్ను కామెడీ యాంగిల్ లోనే కాకుండా కొంచెం సీరియస్ యాంగిల్ లో కూడా చూపించారు. ఇంత మంచి క్యారెక్టర్ కోసం నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశి గారికి కృతజ్ఞతలని నరేష్ మిగతా విషయాలన్నీ సక్సెస్ మీట్ లో చెబుతానని అన్నారు.

Related posts