telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘గని’ ప్ర‌పంచం..

మెగాప్రిన్స్​  హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున‍్న సినిమా గని. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Varun Tej commences shooting for the climax of boxing drama Ghani | Telugu Movie News - Times of India

సినిమా విడుదల కోసం ఎంతగానో ఎద‌రుచూస్తున్న వరుణ్ అభిమానుల‌కు‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమాలో నటిస్తున్న వారి పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్​ చేసింది. మొదట నదియా, తర్వాత నరేష్‌ కనిపించగా, క‍్రమంగా తనికెళ్ల భరణి, నవీన్‌ చంద్ర, సాయి మంజ్రేకర్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రను చూపించారు.

అంతేకాదు ఈ వీడియోలో ఈ నెల 15న టీజర్‌ను భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా ఇప్పుడు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Varun Tej's 'Ghani' Teaser Releasing on Nov 15th/manatelangana.news

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్‌ పిక్చర్స్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గని చిత్రాన్ని డిసెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Related posts