telugu navyamedia
రాజకీయ

భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం రాకపోకలు బంద్‌..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వాతావరణ వ్యవస్థ తీరం దాటుతుందని వాతావ‌ర‌ణ శాఖ‌ తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.

చెన్నైలో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా, చెన్నై విమానాశ్రయానికి రాకపోకలు గురువారం మధ్యాహ్నం 1:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేయబడతాయని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తెలిపింది. “ప్రయాణికుల భద్రత తో పాటు వ‌ర్షం వ‌ల‌న వ‌చ్చే గాలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

High Alert: ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన సర్కార్..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది చనిపోయారు. ఉత్తర చెన్నై, తిరువళ్లూరు, చెంగెల్‌పేట్, కాంచీపురం, రాణిపేట్, విల్లుపురం మరియు కడలూరు జిల్లాలతో సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గురువారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది.

Image

ఈ ఉదయం 11.30 గంటలకు చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 80 కి.మీ మరియు పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్యంగా 140 కి.మీ దూరంలో ఉంది. ఇది గురువారం సాయంత్రానికి వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను కారైకాల్ మరియు శ్రీహరికోట మధ్య, పుదుచ్చేరికి ఉత్తరాన, గురువారం సాయంత్రం వరకు దాటే అవకాశం ఉందని అదికారులు తెలిపారు.

భారీ వ‌ర్షాలు కార‌ణంగా చెన్నైలోని పలు రహదారులు గురువారం జలమయమయ్యాయి. రైలు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో కొన్ని సబర్బన్ రైళ్లు నిలిచిపోగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. విమానాల కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

Related posts