telugu navyamedia
సినిమా వార్తలు

ఐశ్వర్య రాజేశ్‌ ‘భూమిక’ తెలుగు ట్రైలర్‌

ఐశ్వర్య రాజేశ్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని స్ట్రీమింగ్ చేయబోతోంది. నెట్ ఫ్లిక్స్ తన చిత్రాలను వివిధ భాషల్లోకి అనువదించి స్ట్రీమింగ్ చేస్తుంటుంది. ఆ రకంగా ‘భూమిక’ను తెలుగులో డబ్ చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడులైంది. నెట్ ఫ్లిక్స్ సౌత్ లో పోస్ట్ చేసిన ఈ తెలుగు ట్రైలర్ ను ఐశ్వర్యా రాజేశ్ రీ ట్వీట్ చేసింది.

నీలగిరి అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతిని నాశనం చేయడం, అడవులను ఆక్రమించుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను దర్శకుడు రతీంద్రన్ ఆర్ ప్రసాద్ చూపించినట్టు ఈ ట్రైలర్ బట్టి అర్థమౌతోంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకంపై కార్తికేయన్ సంతానం, సుందరం, జయరామన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘భూమిక’ చిత్రానికి ఇటాలియన్ సినిమాటోగ్రఫర్ రాబర్టో జజ్జర వర్క్ చేయడం విశేషం.

Related posts