telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పింక్” రీమేక్ లో సిద్ శ్రీరామ్ పాట

Thaman

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది. ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అక్షరాలా 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన కీలకమైన పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల కోసం ప్రగ్యా జైశ్వాల్‌, అనసూయ భరద్వాజ్‌లను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మేలో సినిమాను రిలీజ్ చేయబోతున్నామని దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించిన ఓ అప్డేట్ ను తమనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “మేమిద్దరం మళ్లీ కలిసాం. ఇన్నాళ్లూ మీరు ఊహించుకున్నదంతా 99.9 శాంత నిజమే. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటను సిధ్ శ్రీరామ్ పాడబోతున్నాడు. ప్రాణం పెట్టి ఈ పాటను కంపోజ్ చేసాం. మీకు ఈ పాటను ఎప్పుడెప్పుడు వినిపిస్తానా అని ఎదురుచూస్తున్నా” అని వెల్లడిస్తూ సిధ్ శ్రీరామ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు.

Related posts