telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

భారీగా పారితోషకం వసూలు చేస్తున్న .. టాలీవుడ్ స్టార్లు…

tollywood actors remuneration updates

సాధారణంగా హీరోల రెమ్యునరేషన్ వాళ్ళ సక్సెస్ రేట్, డిమాండును బట్టి ఉంటుందని చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోల పారితోషికం ఇంత అని చెప్పడం కష్టమే. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోలదే హవా నడుస్తోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్‌ను ఏలుతున్న అగ్రహీరోల రెమ్యునరేషన్స్‌ను పరిశీలిస్తే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకి 25 కోట్ల రేంజ్ ఉండేది. అయితే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకోవడంతో.. ఆయన స్థాయి అమాంతం 50 కోట్లకు చేరింది. పారితోషికం, లాభాల్లో వాటాతో అంటూ ఓవరాల్‌గా అంత ముడుతోందట. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రానికి మహేష్ రూ.54 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి రెమ్యునరేషన్ రూ.40 కోట్ల మార్క్‌ను తాకిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఒక్కొక్కరు 40 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయనకు వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటిలో ఒక్కో సినిమాకి రూ.25 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. అటు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. బాహుబలి 1-2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లేటెస్ట్‌గా రిలీజైన ప్యాన్ ఇండియన్ మూవీ ‘సాహో’తో అతడి స్థాయి చుక్కల్ని తాకింది. ఈ చిత్రానికి గానూ యూవీ క్రియేషన్స్ నుంచి దాదాపు 65 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం.

సీనియర్ హీరోల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం పారితోషికం డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. సొంత ప్రొడక్షన్ బ్యానర్ కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారని అనుకోవచ్చు. అటు విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకి రూ.8 కోట్లు, అక్కినేని నాగార్జున రూ.6 కోట్లు.. నందమూరి బాలకృష్ణ రూ.6 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి. ప్రస్తుతం మాస్‌రాజా రవితేజ కూడా రూ.6 కోట్లు తీసుకుంటున్నారట. యంగ్ హీరోల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకి రూ.12 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటుండగా.. రౌడీ విజయ్ దేవరకొండ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అటు శర్వానంద్ రూ.4 కోట్లు, వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రూ.4 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Related posts