telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : మోనాల్ కే ఎక్కువ రెమ్యూనరేషన్

Monal

బిగ్‌ బాస్‌ హౌస్‌లో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ మధ్య రొమాంటిక్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అలకలు, కోపాలు, గొడవలు, హగ్‌లు ఇవన్నీ ఈ మధ్యే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి సీజన్‌లో ఈ గ్లామర్, అఫైర్ మసాలా కోసం ఒక కంటెస్టెంట్‌ను తప్పకుండా తీసుకుంటారు. ఈ నాలుగో సీజన్‌లో ఆ స్థానాన్ని గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ భర్తీ చేసినట్టు ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే ప్రస్తుతం బయట మోనాల్ గజ్జర్ పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి ఆమె తెలుగులో అల్లరి నరేష్‌తో కలిసి ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలు చేసింది. కానీ, ఆ సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్ గ్లామర్ షో కూడా బాగానే ఉంది. ఎంతైనా హీరోయిన్‌గా చేసింది కదా… ఆమెకు గ్లామర్ షో గురించి కొత్తగా చెప్పేదేమీ ఉండదు. అందుకే ఆమెకు బిగ్ బాస్ హౌజ్‌లో అందరి కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తు్న్నారని టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం మోనాల్‌కు అత్యధికంగా వారానికి రూ. 8 లక్షలు చెల్లిస్తు్న్నారు. లాస్య, నోయల్, అఖిల్, అభిజీత్‌ల కన్నా అధికంగా మోనాల్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ గుసగుసలు. మోనాల్ తరవాత లాస్య, నోయల్ వారానికి రూ.7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇక అభిజీత్, అఖిల్ వరుసగా రూ. 4 లక్షలు, రూ. 3 లక్షలు తీసుకుంటున్నారని టాక్. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Related posts