telugu navyamedia
సినిమా వార్తలు

అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!

Amalapaul

అమలాపాల్ లేటెస్ట్ మూవీ ‘ఆమె’ జులై 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా ఓ సన్నివేశంలో నటించడం హాట్ టాపిక్. అమలాపాల్ న్యూడ్ సీన్స్ లో నటించిన దృశ్యాలని టీజర్ లో చూపించారు. దీనితో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ తన మాజీ భర్త ఏఎల్ విజయ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి విజయ్ ఒప్పుకోలేదు అందుకే విడిపోయారా అని ప్రశ్నించగా.. విజయ్ గురించి అలాంటి కామెంట్ నేనెప్పుడూ చేయలేదని, కారణం అది కాదని అమల చెప్పుకొచ్చింది. ఇక కథ నచ్చితే భవిష్యత్తులో కూడా ‘ఆమె’ లాంటి బోల్డ్ చిత్రాల్లో నటిస్తానని అమల తెలిపింది. ఉదాహరణగా డర్టీపిక్చర్ చిత్రాన్ని వివరించింది. ఆ చిత్రంలో గ్లామర్ గా నటించేందుకు ఓ కారణం ఉంది. అలాంటి కథలు వస్తే చేయడానికి తనకు అభ్యంతరం లేదని అమల తెలిపింది.

2014లో హీరోయిన్ అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకుని ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అమలాపాల్ సినిమాల్లో నటించే విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం అమలాపాల్ బోల్డ్ పాత్రలో నటించిన “‘ఆమె” చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఇటీవలే విజయ్ తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. డాక్టర్ ఐశ్వర్య అనే మహిళతో విజయ్ వివాహం ఈ నెలలో జరగబోతోంది.

Related posts