telugu navyamedia
సినిమా వార్తలు

కార్తికేయ “హిప్పీ” టీజర్ వచ్చేస్తోంది

Hippi

కార్తికేయ హీరోగా నటించిన “ఆర్ఎక్స్ 100” సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కార్తికేయ ఇమేజ్ పెరిగిపోయింది. కార్తికేయకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండగా, ఆయన తరువాత సినిమా గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కార్తికేయ “హిప్పీ” అనే ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఈనెల 20వ తేదీన ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కలైపులి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. “దిగంగాన” ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రంతో తన ఖాతాలో మరో హిట్టు గ్యారంటీ అనే ధీమాతో ఉన్నారు కార్తికేయ. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts