telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాకు కరోనా పాజిటివ్

Thalaivi

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.  తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె.. తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. “నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలపాలని అనుకున్నాను. నియమ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్ళాను. అలాగే ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి కాపాడుకోండి ” అంటూ ఈ కంగనా ట్వీట్ చేసింది.

Related posts