telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా నిబంధనలను మళ్లీ కఠినతరం చేసిన తమిళనాడు…

mask corona

దేశంలో మళ్ళీ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వాలు.. మళ్లీ లాక్‌డౌన్‌, జనతా కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తున్నాయి.. ఇక, తమిళనాడు ప్రభుత్వం మాస్క్‌ నిబంధనలను మళ్లీ కఠినతరం చేసింది.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో మాస్క్‌ తప్పనిసరి చేసింది.. అంతేకాదు.. మాస్క్‌ ధరించకపోతే శిక్షలు కూడా కఠినంగా అమలు చేసేందుకు పూనుకుంది.  దీనికి కారణంగా.. వరుసగా ఊటీలో కోవిడ్ కేసులు పెరగడమే.. దీంతో ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతుండటంతోపాటు సభలు, సమావేశాల్లో పాల్గొనడమే దీనికి కారణమని వైద్యులు కూడా చెబుతున్నారు.. దీంతో నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్సెంట్‌ దివ్య హెచ్చరికలు జారీ చేశారు.. ఊటీలోని ప్రజలు, పర్యాటకులు మాస్కులు ధరించకుండా సంచరిస్తే 6 నెలల జైలుశిక్ష విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేకుండా పట్టుబడినవారికి 6 నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధించనున్నారు. అయితే దేశంలో మళ్ళీ కేసులు పెరుగుతుండటంతో అందరిలో ఆందోళన మొదలయ్యింది.

Related posts