telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

A1 ఎక్స్‌ప్రెస్‌ : “సింగిల్ కింగులం” అంటున్న సందీప్ కిష‌న్

A1

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. ఇతర ప్రధాన పాత్రలలో రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు నటిస్తున్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉంది. ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘హిప్ హాప్ త‌మిళ’ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్ని ఈరోజు చిత్రం అధికారిక మాధ్యమం అయినా యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ‘సింగిల్ కింగులం’ అనే పేరుతో విడుదల అయిన ఈ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు హిప్ హాప్ త‌మిళ’ అందించిన స్వరాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ గాత్రంలో కదం తొక్కిన ఈ గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్యాలు యువతను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు సందీప్ కిషన్ నాయిక లావణ్య త్రిపాఠి తో కలసి ఆడి పాడిన ఈగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Related posts