telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ టీజర్ వచ్చే అప్పుడే..?’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ నుంచి కొత్త ఏడాది ట్రీట్ వచ్చింది. 2021లోకి అడుపెట్టిన మరుక్షణమే వకీల్ సాబ్ అభిమానులకు ఓ ట్రీట్ అందించాడు. ఈ మధ్యనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ లుక్‌ను చిత్రం బృందం తాజాగా విడుదల చేసింది. సరిగ్గా అర్థరాత్రి 12 గంటల సమయంలో అందరూ న్యూ ఇయర్ ఆనందంలో ఉంటే.. వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ పవన్ కళ్యాణ్, శృతి హాసన్‌లకు సంబంధించిన ఓ రొమాంటిక్ లుక్‌ను వకీల్ సాబ్ టీం రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్ బండి నడుపుతుండగా.. వెనుక శృతిహాసన్ కూర్చుని ఉంది. ఈ ఫోటోలో పవన్ ఫుల్ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్‌తో అదిరగొడుతున్నాడు. ఇక సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యూఇయర్ కానుకగా ఓ లుక్‌ను విడుదల చేస్తునట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాదు పవన్ ఫ్యాన్స్‌కు మరో తీపి కబురు కూడా చెప్పింది. అదేంటంటే.. వకీల్ సాబ్ టీజర్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారట. ఇక ఏప్రిల్ 09న సినిమా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆగిపోవడంతో సినిమా నిరవధిక వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ మధ్యనే షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.

Related posts