తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన పిల్లలకు ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’లో ఫీజుల్లో స్కాలర్ షిప్ ఇవ్వనున్నామని అని విలక్షణ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ నోట్ విడుదల చేశారు.
‘‘47 సంవత్సరాలుగా సినీ కళామతల్లి నన్ను నటుడిగా, నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది. 30 ఏళ్లుగా ‘శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’కి అధినేతగా ఉన్నాను.
1992లో ఈ విద్యాలయాల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో విద్యార్ధులు కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది పిల్లలకు, మన సినిమా ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది పిల్లలకు 25శాతం మందికి కులమతాలకు అతీతంగా ఉచితంగా విద్యను అందిస్తున్నామని బాబు అన్నారు.
భగవంతుని ఆశీస్సులతో ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలన్నీ ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’ (యమ్‌బి యూనివర్శిటీ) గా మారిందని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నా అని అన్నారు.
ఈ శుభ సందర్భాన నాకెంతో ఇచ్చిన తెలుగు పరిశ్రమకు ఏదైనా ఉడతా భక్తిగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందినవారి పిల్లలు మా ‘యమ్‌బీయు’లో చదవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశీస్తున్నాని మెహన్‌బాబు అన్నారు.