telugu navyamedia
విద్యా వార్తలు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ఇదే

ఆంధప్రదేశ్ లోని టెన్త్ , ఇంటర్ పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ మారినట్లు విద్యాశాఖ తెలిపింది.

దీని ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 6 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. 

మే 7, 9 తేదీల్లో కాంపోజిట్ కోర్సులు.. ఓకేషనల్ కోర్సుల పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్..

ఏప్రిల్ 27- తెలుగు.
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్.
మే 2- మ్యాథ్స్.
మే 4- సైన్స్ పేపర్ 1
మే 5- సైన్స్ పేపర్ 2
మే 6- సోషల్ స్టడీస్.

Related posts