telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్స్ కి ప్రభాస్ వ‌స్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా గ‌త కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషనలలో భాగంగా కొత్త ఇంటర్వ్యూ ని స్ట్రీమింగ్ చేశారు మేకర్స్.నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేయనున్నారు చిత్రయూనిట్. అలాగే ఈ నెల 19న ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కర్ణాటకలో జరగనుంది.

ఈ ఇంటర్వ్యూ లో ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ ప్రీమియర్స్ కోసం ప్రభాస్ ని పిలుద్దామా అని రాజమౌళిని తారక్ అడగగా.. రాజమౌళి ప్రీమియరా..? ఏ ప్రీమియర్ .? అని అంటాడు.

దానికి తారక్ మాకేదో పెద్ద స్పెషల్ గా ప్రీమియర్ వేసినట్టు ఇక్కడ.. అంటాడు..ఆయన ఒక ప్రీమియర్ కోసం కదిలి రావడం జరిగే పని కాదులే అని చెప్పగా .. నువ్ కాకపోతే చరణ్ పిలుస్తాడు, లేకపోతే మేమిద్దరం పిలుస్తాం అని తారక్ అంటాడు. ఇవన్నీ కాదు.. అది జరిగే పని కాదు.. ప్రభాస్ రాడు .. వదిలేయ్ అని జక్కన్న ఫన్నీగా చెప్పడం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ దుబాయ్ లో “ఎక్స్ పో 2020 దుబాయ్‌” పేరుతొ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. రేపు (మార్చి 19) సాయంత్రం కర్నాటకలోని చిక్కాబల్లాపూర్‌లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత దేశంలోని తొమ్మిది మెయిన్‌ సీటీస్‌ని ఈ బృందం కవర్‌ చేయబోతుంది.

Related posts