telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీరెడ్డి వల్ల వర్మ నన్ను శృంగారిగా మార్చారు : శ్రీరాపాక

Srirapaka

ఆర్జీవీ తీసిన ‘నగ్నం’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ రాపాకను స్వీటీగా టాలీవుడ్‌కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. వర్మ చెక్కిన ‘నగ్నం’ చిత్రంతో పాపులర్ అయిన ఈ స్వీటీ.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఆర్జీవీ అంటే క్రియేటివ్.. కొన్ని ఏళ్ల క్రితమే ఆయనో ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తితో నేను పనిచేయడం గర్వంగా ఉంది. అంతేకాకుండా ఆయన నేను చేసిన ప్రతి షాట్‌ను అభినందించేవారు. స్వీటీ.. భలే చేశావ్ అనేవారు. స్వీటీ.. స్వీటీ.. అని మాత్రమే అనేవారు. చాలాసార్లు శ్రీ అనండి సార్.. నా పేరు శ్రీ రాపాక అంటే.. ఆ పేరు నాకు నచ్చలేదు అన్నారు. ఎందుకు అంటే.. శ్రీ అంటే శ్రీరెడ్డి గుర్తుకువస్తుంది.. నాకు ఆ పేరు నచ్చదు అందుకే నువ్ స్వీటీ అన్నారు. శ్రీ అంటే శ్రీరెడ్డి మాత్రమే కాదు.. శ్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్పా.. కావచ్చు కాని!! నాకు శ్రీ అంటే శ్రీ రెడ్డి గుర్తుకువచ్చింది. నాకు ఆ పేరు పలకడం ఇష్టం ఉండదని చెప్పారు. ‘నగ్నం’లో కూడా నీ పేరు మార్చేస్తున్నా అన్నారు.. ఏం పేరు అంటే.. శృంగారి అని చెప్పారు. మీకు దండం పెడతా శృంగారి వద్దు.. నాకు నచ్చలేదు అని బ్రతిమిలాడితే స్వీటీకి ఫిక్స్ అయ్యారాయన అంటూ చెప్పుకొచ్చింది నగ్నం హీరోయిన్ స్వీటీ అలియాస్ శ్రీ రాపాక.

Related posts