telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‏బాస్ సీజన్ 6 ఫస్ట్ వీకెండ్.. నాగ్ ఒక్కొక్క‌రికి ఇచ్చిపడేశాడుగా

బిగ్‏బాస్ సీజన్ 6 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారం.. ఆదివారం నాగార్జున వచ్చి చేసే సందడి మాములుగా ఉండదు. వారం మొత్తం జరిగిన సంఘటనలపై తనదైన స్టైల్లో క్లాసులు తీసుకుంటారు నాగ్.

తాజాగా సీజన్ 6 ఫస్ట్ వీకెండ్ శనివారం ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇందులో ఇంట్లో సభ్యులకు స్వీట్ అండ్ షార్ట్‏గా నాగ్ క్లాస్ తీసుకున్నట్టే తెలుస్తోంది.

ఈ ప్రోమోలో నాగార్జున ‘మా ఇల్లు ఎలా ఉంది?’ అని అడిగారు.దానికి అందరూ ‘మన ఇల్లు’ అన్నారు. ‘అలా అంటే గీతూ ఒప్పుకోదు’ అంటూ సెటైర్ వేశారు.

గీతూ ‘అలా కాదు సర్’ అనే సరికి, వ‌ద్దులే గీతూ ‘నీతో ఎందుకు నాకు గలాటా’ అంటూ అక్కడికే కట్ చేశారు. అలాగే రేవంత్ నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావ్ అన్నారు నాగ్. రేవంత్ ‘నేనా’ అనగానే, ‘సాక్ష్యాలు చూపించమంటావా’ అని అడిగారు నాగ్. వెంటనే వద్దు సర్ అనేశాడు రేవంత్.

ఇక హగ్ కోసం అలిగిన మెరీనాకు..భర్తతో రోహిత్‏తో హగ్ ఇప్పించాడు. నారాయ‌ణ‌..నార‌య‌ణ వాళిద్ద‌రు మ్యారిడ్ క‌పుల్స్ అంటూ సెటైర్లు వేశారు.

ఇక ఆరోహి, రేవంత్ గొడవ గురించి లేవనెత్తారు నాగ్. ‘ఆమె ఓడిపోయిన బాధలో వస్తే అలా అనడం అవసరమా’ అని రేవంత్‌ను అడిగారు. ఆ తరువాత ఆరోహి వచ్చి రేవంత్ కు సోరీ చెబుతుంటే ఇద్దరు కామెంటేటర్లు మధ్యలో మాట్లాడడమేంటి? అని ప్రశ్నించారు. వారిద్దరికీ రివ్యూలు రివ్యూలు చెప్పి చెప్పి అలవాటైపోయింది అంటూ పరోక్షంగా ఆదిరెడ్డికీ, గీతూకి చురకలు అంటించారు.

అయితే ఎదో ఆలోచిస్తున్నట్లు ఆదిరెడ్డి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో అంతొద్దు అంటూ చురకలు అంటించాడు. మొత్తానికీ శనివారం ఎపిసోడ్‏లో కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి క్లాస్ తీసుకోనున్నట్లుగా ప్రోమోతో తెలియజేశారు.

Related posts