telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదిపురుష్ : సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలు…!

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదట ఆ పాత్రలో కీర్తి సురేష్, కియారా అద్వాణీ, ఊర్వశి రౌటెలా.. పేర్లు విన్పించాయి. కానీ ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ తెరమీదకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అయితే సినిమా ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇంకా ఆయనతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts