telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” టైటిల్ సాంగ్ విడుదల

Ala

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ సినిమా విడుదల తేదీ మారుబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 6న సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హిస్తున్నారు. మ్యూజిక్ క‌న్‌స‌ర్ట్ క‌ర్టెన్ రైజ‌ర్‌ను వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుల చేసింది. “అల వైకుంఠ‌పుర‌ములో…” అంటూ సాగే ఈ పాట పోత‌న భాగ‌వ‌తంలోని ఓ ప‌ద్యం. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో ప్రియా సిస్ట‌ర్స్ ఈ ప‌ద్యాన్ని ఆల‌పించారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts