విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చివరి చిత్రం శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ “మేజర్ చంద్రకాంత్” సినిమా. 23-04-1993 విడుదలయ్యింది.
నటుడు, నిర్మాత మోహన్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రాన్నికి కధ, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు; సి.నారాయణ రెడ్డి, జాలాది, గురుచరణ, సంగీతం:ఎం.ఎం. కీరవాణి, ఫోటోగ్రఫీ: విన్సెంట్, కళ: భాస్కర రాజు, కూర్పు: గౌతమ్ రాజు సమకూర్చారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, శారద, గుమ్మడి, మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ, అమ్రిష్ పురి, బ్రహ్మానందం, బాబూమోహన్, శ్రీహరి, మాస్టర్ మనోజ్ కుమార్, సుధ, ప్రసాద్ బాబు, అచ్యుత్, సాయికుమార్ తదితరులు నటించారు.
సంగీత దర్శకులు యం.యం.కీరవాణి గారి సంగీత సారధ్యంలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“పుణ్యభూమి నాదేశం నమోనమామి”
“సుమంగళి సుఖీభవ – ఈ బాల వాక్కు”
“నీక్కావలసింది నా దగ్గరవుంది”
“ఉలికిపడకూ అల్లరిమొగుడా”
“ముద్దులతో ఓనమాలు నేర్పించనా”
వంటి సూపర్ హిట్ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రధానంగా జాలాది గారు వ్రాసిన
“పుణ్యభూమి నాదేశం నమోనమామి” పాటలో
“ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్” వంటి దేశభక్తుల పాత్రలలో ఎన్టీఆర్ గారు తన నటవిశ్వరూపాన్ని మరొక సారి ప్రదర్శించి ప్రేక్షకులకు కనులవిందు చేశారు.
నటుడు మోహన్ బాబు అన్న నందమూరి తారకరామారావు గారితో ఒక మంచి సినిమా తీయాలనే తలంపుతో ఎన్టీఆర్ గారిని ఒప్పించి, గతంలో ఎన్టీఆర్ గారి కాంబినేషన్ తో పలు హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన 78 కేంద్రాలలో 50 రోజులు, 43 కేంద్రాలలో (32 డైరెక్ట్ + 11 షిఫ్ట్) 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది.
ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1. విజయవాడ – అప్సర
2. గుంటూరు — పల్లవి
3. నెల్లూరు — కృష్ణ
4. వైజాగ్ — మెలోడీ
5. రాజమండ్రి — ఊర్వశి
6. కాకినాడ — చంద్రగుప్త
7. విజయనగరం — న్యూపూర్ణ
8. అనకాపల్లి — శ్రీలక్ష్మి
9. ఏలూరు — మిని విజయలక్ష్మి
10. భీమవరం — నటరాజ్
11. తణుకు — వెంకటేశ్వర
12. తాడేపల్లి గూడెం — విజయా
13. పాలకొల్లు — వెంకట రామ
14. మచిలీపట్నం — కృష్ణ కిషోర్
15. తెనాలి — లక్ష్మి డీలక్స్
16. ఒంగోలు — శ్రీనివాస
17. నరసరావుపేట — ఈశ్వర్ మహల్
18. సత్తెనపల్లి — సంగం
19. అనంతపూర్ — శాంతి డీలక్స్
20. పెద్దేవం — శ్రీనివాస
21. కర్నూలు — వెంకటేష్
22. కడప — అపూర్వ
23. ఆళ్ళగడ్డ — శివరాం
24. కదిరి — సంగం
25. తిరుపతి — మినీప్రతాప్
26. మదనపల్లి — సిద్దార్థ ( 77 రోజులు+పంచరత్న 23 రోజులు)
27. చిత్తూరు — రాఘవ (77 రోజులు + ప్రమీల 23 రోజులు)
28. హైదరాబాద్ — సుదర్శన్ 70MM
29. ఖమ్మం — వినోద
30. వరంగల్ — రామా ( సింగిల్ షిఫ్ట్)
31. తిరువూరు — వెంకటరామా (71 రోజులు+ శ్రీనివాస 29 రోజులు)
32. మహబూబ్ నగర్ — రాధాకృష్ణ (సింగిల్ షిఫ్ట్)
33. శ్రీకాకుళం — సరస్వతి
34. జంగారెడ్డిగూడెం — లక్ష్మి
35 మిర్యాలగూడ — శకుంతల
36. పిడుగురాళ్ల — జయలక్ష్మి
37. చీరాల — గోపాల కృష్ణ
38. వినుకొండ — అరుణ
39. నంద్యాల — ఖలీల్
40. ఆదోని — నిర్మల
41. ఎమ్మిగనూరు — రాఘవేంద్ర
42. రాజం — శ్రీనివాస
43. చింతలపూడి — రత్న పిక్చర్ ప్యాలస్
ఎన్టీఆర్ గారు హీరో గా నటించిన చివరి చిత్రం “మేజర్ చంద్రకాంత్'” అయితే అంతకు ముందే ఎన్టీఆర్ గారు బాపు గారి దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమాలో నటించడం జరిగింది.
కానీ ఈ సినిమా “మేజర్ చంద్రకాంత్” చిత్రం విడుదలైన తర్వాత “శ్రీనాథ కవిసార్వభౌముడు” సినిమా విడుదల కావటం జరిగింది.
కాగా హీరోగా నటించిన ఎన్టీఆర్ గారి చివరి చిత్రం మాత్రం “మేజర్ చంద్రకాంత్”. అయితే థియేటర్స్‌లో విడుదలైన చివరి చిత్రం మాత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ కావటం విశేషం.
ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచి, అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా క్రాస్ చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందించిన నయనతార…