telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” నుంచి మొదటి సాంగ్

venki mama movie title logos

వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ..నా ధైర్యం, నాసైన్యం నువ్వేలే వెంకీమామ’ అంటూ సాగే ఈ పాట మామ, అల్లుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts