telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జనవరిలో చివరిసారిగా కుటుంబసభ్యుల్ని కలిశా… : లావణ్య త్రిపాఠి

Lavanya Tripati

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యింది. అయితే లావణ్య కుటుంభం డెహ్రడూన్ నివాసముంటున్నారు. లావణ్య మాత్రం హైదరాబాద్ లో ఇరుక్కుపోయింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ సొట్టబుగ్గల సుందరి కుటుంబం దగ్గరకు చేరిందట. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘ఒంటరితనాన్ని నేను ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవ్వను. స్వాతంత్ర్యంగా బతకాలనే ఆలోచనతో పదహారేళ్ల వయసులోనే కుటుంబాన్ని విడిచి ఒంటరిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. జనవరిలో చివరిసారిగా కుటుంబసభ్యుల్ని కలిశా. ఆరు నెలల పాటు వారికి దూరంగా ఉండటం వెలితిగా అనిపించింది. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయానని భయపడలేదు. నాలోని నైపుణ్యాలను మెరుగులు దిద్దుకోవడంపై ఈ విరామంలో దృష్టిపెట్టా. ఒంటరిననే ఆలోచనను ఏ రోజు నా మనసులోకి రానివ్వలేదు. కరోనా ప్రభావ ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డెహ్రాడూన్‌ వెళ్లడానికి చాలా భయపడ్డాను. పీపీఈ కిట్‌ ధరించి ప్రయాణించా. స్వస్థలం చేరుకోగానే కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయినా జాగ్రత్తలు పాటిస్తున్నా… అంటూ చెప్పుకొచ్చింది. కాగా లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ్యారు. ఆ తర్వాత ఆమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కూడా తన నటనకు మంచి గుర్తింపు లభించింది.

Related posts