telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

“అతిబల”తో అమితమైన ఆరోగ్యం

Mallow

అమితమైన బలాన్ని అందించే ఆయుర్వేద ఔషధం అతిబల. దీనిని తెలుగులో ముద్ర బెండ, తుత్తురు బెండ, దువ్వెన కాయల చెట్టు, అతిబల అని పిలుస్తుంటారు. దాదాపుగా దీని గురించి తెలియని గ్రామీణులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లలో అసాధారణమైన ఔషధ శక్తి ఉంటుంది. ఇప్పుడు అతిబల ఔషధ గుణాలు, మన ఆరోగ్యానికి దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Mallow

* అతిబల ఆకును కషాయంగా చేసి చల్లార్చాలి. చల్లార్చిన కషాయాన్ని మూసిన కళ్లపై వేసి కడుగుతూ ఉంటే కంటి దోషాలు హరించిపోతాయి.
* అతిబల ఆకులను నీటిలో నానబెట్టి, వడపోసి అందులో కొద్దిగా కండచక్కెరను కలిపి కొద్దికొద్దిగా సేవిస్తూ ఉంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. ఇదే నీరు మూడు పూటలా సేవిస్తూ ఉంటే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు, దీర్ఘకాలిక దగ్గు తగ్గిపోతాయి. అంతేకాదు మూత్రపిండంలోని రాళ్ళు కూడా కరిగిపోతాయి.
* తుత్తురు బెండ గింజలు 50 గ్రాములు, శతావరి వేర్ల పొడి 100 గ్రాములు ఆ రెండింటికీ సమంగా పాతిక బెల్లం పొడిని కలపాలి. ప్రతిరోజూ రెండుపూటలా ఒక చెంచా పొడి తిని, ఒక కప్పు పాలు తాగుతూ ఉంటే శీఘ్రస్కలనం సమస్య తగ్గిపోతుంది.
* పిచ్చి కుక్క కరిచిన వెంటనే అతిబల ఆకులరసం 70 గ్రాములు తాగించాలి. ఆకు ముద్దను కుక్క కాటుపై వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే విషం విరిగిపోతుంది.

* అతిబల ఆకులు ఏడు తీసుకుని, మంచినీటితో నూరి, బట్టలో వడపోసి, ఆ రసంలో చక్కర కలిపి రెండు పూటలా తాగుతూ, ఆకులను నలగ్గొట్టి నొప్పులపై వేసి కట్టుకడుతూ ఉంటే నడుమునొప్పితో పాటు ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయి.

Mallow
* అతిబల ఆకులను కూరలా వండి రెండు పూటలా తింటుంటే మొలల నుండి రక్తం కారడం తగ్గిపొతుంది. ఇంకా అతిబల ఆకులు 21, మిరియాలు 21 తీసుకుని, మొత్తం కలిపి మెత్తగా నూరి 7 గోళీలను తయారు చేయాలి. రోజుకొక గోలీ చొప్పున పరగడుపునే మంచినీటితో 7 రోజులు తీసుకోవాలి. ఇలా చేస్తే వాతదోషం వల్ల కలిగే మొలలు హరించిపోతాయి.
* అతిబల వేర్లను దంచి, పొడిచేసి, జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని మూడు నాలుగు చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి ముందు సేవిస్తూ ఉంటే గుండెకు బలం కలగడమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.
* అతిబల వేరును నిల్వచేసుకుని, ఆ వేరును నీటితో సానరాయిపై అరగదీసి, కండరాల వాపుపై పట్టించాలి. ఇలా చేస్తే కండరాల వాపు తగ్గిపోతుంది.
* బాగా ముదిరిన అతిబల చెట్టును పూర్తిగా పెకిలించి, ముక్కలుగా చేసి ఎండలో ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా నీరు పోసి మూడు రోజుల పాటు అలాగే ఉంచాలి. దాన్ని రోజుకోసారి కర్రతో కలుపుతూ ఉండాలి. నాలుగవ రోజు పైకి తెలీని నీటిని మాత్రమే తీసుకుని చిన్న మంటపై మరిగిస్తే తెల్లటి క్షారం మిగులుతుంది. దాన్ని మెత్తగా నూరి నిల్వ ఉంచుకోవాలి. ఈ క్షారం రెండు మూడు చిటికెల మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు, ఉబ్బసం తగ్గిపోతాయి.

Related posts