telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పుష్ప’ టైటిల్ ని ఆరు నెలల క్రితమే చెప్పిన బన్నీ

Pushpa

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ తీస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రష్మిక బన్నీకి జంటగా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్‌గా అలరించనున్నారు. తాజాగా బుధవారం బన్నీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. గతేడాది నవంబర్‌లోనే బన్నీ ఈ సినిమా పేరును బయట పెట్టాడన్న మరో వార్తపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. 2019 న‌వంబ‌ర్ 27న బన్నీ ట్వీట్ చూస్తే…. ‘సుక్కు జుట్టు రంగు మారింది. నా స్కిన్ కలర్ మారింది. కానీ ప్రేమ మాత్రం మారలేదు. మేం కలుసున్నప్పుడు ఏదీ మారదు. మీరు త్వరలోనే దీనికి సాక్షుల‌వుతారు’’ అనే మెసేజ్‌తో పాటు పక్కనే ‘పుష్ప’ అనే టైటిల్‌ను డిఫ‌రెంట్‌గా పోస్ట్ చేశారు బ‌న్నీ. కానీ అభిమానులు, ప్రేక్ష‌కులే మాత్రం ఈ విషయాన్ని గమనించలేకపోయారు. ఇప్పుడు సినిమా టైటిల్ పుష్ప అని తేలడంతో అప్పటి బన్నీ ట్వీట్ కూడా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related posts