విడాకుల విషయమై దర్శకుడు శ్రీనువైట్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది.
నీకోసం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆనందం, సొంతం, ఢీ, రెడీ, దూకుడు, బాద్‌షా చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడీ డైరెక్టర్. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనవుతున్నాడు.
ఆయన భార్య రూప శ్రీనువైట్లతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన తన మనసులో ఉన్న ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు.
‘జీవితం చాలా అందమైంది. కానీ నచ్చిన వాళ్లతో ఉంటే ఆ జీవితం మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురూ(కూతుర్లు) లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను అంటూ కూతుర్లపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ.. వారితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. ‘మీరేం బాధపడకండి సార్. మీరు కోల్పోయినవి తిరిగి మీకు దక్కుతాయి’ అంటూ అభిమానులు భరోసా ఇస్తున్నారు.
ఒక్క హిట్ పడితే మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.