telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుస టీజర్స్ తో ఆకట్టుకుంటున్న “కృష్ణ అండ్ హిజ్ లీల”

KAHL

సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ.. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు చిత్రంలోని ముగ్గురు హీరోయిన్లతో ఉన్న రిలేషన్‌ని తెలియజేస్తూ.. ‘కృష్ణ ఫస్ట్ లవ్’, ‘సెకండ్ లవ్’, ‘థర్డ్ లవ్’ అంటూ చిన్న చిన్న టీజర్స్‌ను విడుదల చేస్తున్నారు. సోమవారం విడుదల చేసిన ‘కృష్ణ ఫస్ట్ లవ్’ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం ‘కృష్ణ సెకండ్ లవ్’ టీజర్‌ను వదిలారు. ఫస్ట్ లవ్‌కి ఏ మాత్రం తగ్గకుండా రాధ‌గా నటించిన శాలినీతో కృష్ణ లీలలు చూపించారు. ఈ మూడో లవ్ ‘కృష్ణాస్ బేబి రుక్సార్’ అనే టైటిల్‌తో వదిలారు. ఇక ‘కృష్ణాస్ బేబి రుక్సార్’ టీజర్ విషయానికి వస్తే.. ఫస్ట్ రెండు టీజర్స్ అంత లేదు కానీ.. శీరత్ లుక్ మాత్రం యూత్‌ని ఆకర్షించేలా ఉంది. హీరో సిద్ధు మాత్రం రెండు టీజర్స్‌లో ఎలా అయితే ఆకట్టుకున్నాడో ఈ టీజర్‌లోనూ అలానే మెప్పించాడు. మొత్తంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లుగా విడుదలైన మూడు టీజర్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. టీజర్స్‌తోనే ఆకర్షించిన ఈ కృష్ణగాడి పూర్తి లీలలు తెలియాలంటే ఓటీటీకి లాగిన్ అవ్వాల్సిందే.

Related posts