telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు రుణమాఫీ ప్రకటించిన .. సీఎం ఉద్దవ్

uddav takrey on excitement as upcoming cm

మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ మాఫీ పథకం’ కింద 2019, సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న వ్యయసాయ రుణాలు రద్దు కానున్నాయి. ఈ రుణాలకు చెల్లించాల్సిన డబ్బు రైతులకు మరోక విధంగా సహాయ పడుతుందని ఉద్ధవ్ అన్నారు. రైతు రుణాలను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి-2020 నుంచి అమలు చేస్తామని సీఎం ఉద్దవ్‌ థాక్రే తెలిపారు. రైతు రుణ మాఫీ అమలు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కార్యాలయాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతులు ప్రతి చిన్నపనికి ముంబై రావల్సిన అవసరం లేకుండా ఆ కార్యలయాల్లో ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన అన్నిపధకాలు పూర్తిచేసుకోవచ్చని ఆయన వివరించారు.

ఈపధకం కింద అన్ని రైతు రుణాలు మాఫీ కాలేదని ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ నాయకులు సభనుంచి వాకౌట్ చేశారు. దీనివల్ల కౌలురైతుల రుణాలు రద్దుకాలేదని వారు ఆరోపించారు. అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో రైతు రుణమాఫీ పై ప్రధాన రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ లో బీజేపీ 105 స్ధానాలు గెలుచుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. అధికారాన్ని అందుకోడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 145 చేరుకోవటంలో బీడేపీ విఫలమవటంతో కాంగ్రెస్,ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకు ముందు ఎన్సీపినుంచి నాయకుడు అజిత్ పవార్ తో జతకట్టి బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.

Related posts