telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో టీఆర్ఎస్ ఎమ్యెల్యేపై కబ్జా కేసులు.. అంతలోనే ట్విస్ట్ !

TRS flag

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భూవివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాప్రా భూ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని తనకు ఎమ్మార్వో చెబితే ఆ విషయంపై పోలీసు అధికారితో మాట్లాడాతానని ఆయన వెల్లడించారు. తాను ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అడ్డుకున్న కానీ..తనకు ఎటువంటి దుర్బుద్ధి లేదన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా అడ్డుకునే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై ఉందని..తాను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే.. తాను దేనికి అయిన సిద్ధమే అని పేర్కొన్నారు. తాను కూడా కోర్టుకు వెళ్తానని…తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై
పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Related posts