telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ సినిమాకు నాగార్జునకు దర్శకుడు దొరకడం లేదా…?

Nagarjuna

తనదైన నటనతో అద్భుత ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు నాగార్జున. భక్తి సినిమాలు చేసి అసలుసిసలైన భక్తుడిగా పేరు తెచ్చుకున్నారడు. అదేవిధంగా లవ్ స్టొరీస్ చేసి గ్రీకువీరుడు బిరుదును అందుకున్నాడు. ఎప్పడికప్పుడు కొత్త తరహా కథలు విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడు తన కథల ఎంపిక చేసుకొనే పద్దతి మార్చాలని, అతడిని ఇంకా గ్రీకువీరుడిలా చూడటిని ప్రేక్షకులు ఆసక్తి చూపట్లేదని కొందరు అన్నారు. దాంతో నాగ్ కూడా తన గేర్ మార్చాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాను చేయాలని అనుకున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన రైడ్ సినిమా చేసేందుకు నాగ్ ఆసక్తి చూపాడు. కానీ ఆ సినిమాను చేసేందుకు ఎవ్వరు ముందుకు రాలేదని అన్నారు. తరువాత ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకొచ్చాడని తెలిసింది. కానీ ప్రవీణ్ అసలు కథను నాగ్‌కు సరిపోయే విధంగా కొన్ని మార్పులు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు సొలోమొన్‌ను నాగ్ సంప్రదించాడని, అయితే అతడు ఒరిజినల్ వైల్డ్ డాగ్ స్క్రిప్ట్‌తో వచ్చాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నాగార్జునా రైడ్ సినిమా చేయడానికి దర్శకుడిని వెతుకుతున్నాడు

Related posts