telugu navyamedia
రాజకీయ

లక్నోవస్తున్న ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్‌ఖేర్‌ గ్రామానికి వెళుతున్నకాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకుని, సీతాపూర్‌లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించిన సంగతి తెలిసిందే.

Detained for last 28 hours without an order or FIR, says Priyanka Gandhi -  India News

అజాదీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో పాల్గనేందుకు ప్రధాని మోడీ లక్నోకు  వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని లఖింపూర్ లో పర్యటించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ప్ర‌శ్నించారు. లఖింపూర్ ఖేరి హింస ఘటన వీడియో ను చూపిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ ఆమె డిమాండ్ చేశారు. స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు ప్రధాని మోడీ వస్తున్నారని.. కాని మనకు స్వేచ్ఛను ఎవరిచ్చారని ప్రియాంక ప్రశ్నించారు. రైతులు మాకు స్వేచ్ఛనిచ్చారని గుర్తు చేశారు.

Live Updates: Priyanka Gandhi Vadra Hits Out At PM After Lakhimpur Kheri  Violence In Uttar Pradesh

ఘటన తాలూకు వీడియో చూసి మీ క్యాబినెట్ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదో, కానీ భయంకర నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రియాంక ప్రశ్నించారు. నాలాంటి విపక్ష నేతలను మాత్రం ఆదేశాలు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్టులు చేస్తారు.. కానీ ఆశిష్ మిశ్రా మాత్రం స్వతంత్రంగా బయట తిరుగుతున్నాడని అన్నారు.

లఖీంపూర్ ఖేరీ: స్కూల్‌కు వెళ్లే పిల్లవాడిని కూడా చంపారని ఓ మహిళ ఆరోపించారు

రైతులు మనకు స్వాతంత్య్రం సాధించిపెట్టారనే విషయాన్నీ ప్రధాని గుర్తుతెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా రైతుల బిడ్డలే సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్నారు. నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న మీరు పట్టించుకోవడం లేదు. లఖింపూర్ ఖేరి కి రండి, రైతులు ఏం అనుకుంటున్నారో, వారి సమస్యలేంటో తెలుసుకోండి. వారిని కాపాడాల్సిన కర్తవ్యం మీపై ఉంది.’’ జై హింద్‌..జై కిషాన్ ప్రియాంక అన్నారు.

Related posts