సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్ వద్ద పాకిస్థాన్ కాల్పులకు పాల్పడగా ముగ్గురు భారత జవానులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ముగ్గురిలో ఇద్దరు జవానులు శనివారం ఉదయం మృతి చెందారు. మరొకరు కోలుకుంటున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన ఫూంచ్ జిల్లాలో పాక్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి