జార్ఖండ్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్ మృతి చెందాడు. సిమ్‌దెగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో నక్సలైట్ కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.
నక్సలైట్లు ఉన్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు సిమ్‌దెగా జిల్లాలో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒకరు మరణించారని, మరోకరు తీవ్రంగా గాయపడ్డారని ఐజీ సాకేత్ కుమార్‌సింగ్ వెల్లడించారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేసింది: యనమల