telugu navyamedia
వార్తలు సామాజిక

వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తాం: రైల్వే శాఖ

Train Indian railway

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు రైల్వేస్టేషన్లకు రావద్దని సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రయాణికులు మినహా ఇతరులెవరూ రైల్వేస్టేషన్లకు రావద్దని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో కోరారు. ఇతర రాష్ట్రాల వలసకూలీలు ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే వారిపేర్లను రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు.

రైల్వే శాఖ ఎవరికీ టికెట్లు జారీ చేయదని, రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసిన వారిని మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. నాసిక్ నుంచి లక్నో, భోపాల్ నగరాలకు రెండు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో వలసకార్మికులను తరలించామని చెప్పారు. మే 17వరకు లాక్ డౌన్ పొడిగించినందున అప్పటివరకు రైళ్లు నడవవని ఆయన తెలిపారు.

Related posts