telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

క‌రోనా మ‌హమ్మారిపై జగన్‌ సమీక్ష

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు (బుధవారం) క‌రోనా మ‌హమ్మారిపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా స‌మావేశంలో పలు కీల‌క అంశాల‌పై చర్చ జ‌రిగింది. ఆక్సీజ‌న్ కొర‌త‌, క‌రోనా థ‌ర్డ్ వేవ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు తదిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించారు. క‌రోనా క‌ట్ట‌డికి అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కూడా సీఎం ఆరా తీశారు. ఈనెల 16 వ తేదీనుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతుండ‌టంతో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఉపాద్యాయులంద‌రికీ వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆక్సీజ‌న్‌, మందుల కొర‌త లేకుండా చూడాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో ప్ర‌తిరోజు వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌తంతో పోల్చుకుంటే ఈ కేసులు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉన్న నేపధ్యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిబంధ‌న‌ల‌ను వీలైనంత వ‌ర‌కు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.

18 నుంచి 44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన చెప్పారు. అనంతరం డిజిటల్‌ హెల్త్‌పై సమీక్షించిన సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్‌ కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ క్లీనిక్స్‌లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్‌, వార్డు క్లీనిక్స్‌లో కూడా కంప్యూటర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. విలేజ్ క్లీనిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి రావాలని, షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్‌ సహా ఇతర వివరాలు కార్డులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు.

Related posts